Dyuthichand: తన సోదరిపై సంచలన ఆరోపణలు చేసిన స్టార్ అథ్లెట్ ధ్యుతీచంద్!

షార్ట్స్‌లో చూడండి
తాను స్వలింగ సంపర్కినని, ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని గతంలో బహిరంగ ప్రకటన చేసి, క్రీడావర్గాల్లో కలకలం రేపిన స్టార్ అథ్లెట్ ద్యుతీచంద్, ఈ దఫా తన సోదరిపై సంచలన ఆరోపణలు చేసింది. తన అక్క సరస్వతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, రూ. 25 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తోందని ఆరోపించింది. తాను స్వలింగ సంపర్కం గురించి చెప్పిన తరువాత, అక్క మారిపోయిందని, డబ్బు కోసం వేధిస్తోందని, ఆటపై దృష్టిని కేంద్రీకరించలేక పోతున్నానని వాపోయింది.

భువనేశ్వర్ లో సరస్వతి తనపై చెయ్యి చేసుకుందని, దీనిపై తాను గతంలోనే పోలీసులను ఆశ్రయించానని చెప్పింది. తాను మరో అమ్మాయిని ప్రేమించడం తన వ్యక్తిగతమని, ఎవరు అభ్యంతరం చెప్పినా తాను పట్టించుకోబోనని స్పష్టం చేసిన ద్యుతీచంద్, తాను కుటుంబాన్ని ఆదుకోలేదని కన్నతల్లే ఆరోపించడం బాధించిందని, తాను వారిని ఎంతో ఆదుకున్నానని చెప్పింది. 2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లో సత్తా చాటాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నానని, ఈ సమయంలో తన భాగస్వామిని బహిర్గతం చేయవద్దని మీడియాను ద్యుతీచంద్ కోరింది.
Go Back to Shorts
Dyuthichand
Athlet
Sister

More Telugu News