Mango: మామగారి ఊళ్లో.. మామిడి చెట్టెక్కి కూర్చున్న గాలి జనార్దన్ రెడ్డి!

  • కర్నూలు జిల్లాకు వచ్చిన గాలి
  • మామిడి తోటలో సరదాగా గడిపిన మాజీ మైనింగ్ కింగ్
  • కాయలు కోసి కుటుంబీకులకు పంచి ఆనందం
ఒకప్పటి మైనింగ్ కింగ్, అక్రమాస్తుల కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చిన మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, మామిడి చెట్టెక్కి కూర్చున్నారు. అంతేనా, తన భార్య, కుటుంబ సభ్యులకు కాయలు కోసి పంచారు. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, తన మామ అయిన పరమేశ్వరరెడ్డి సొంత గ్రామం, కర్నూలు జిల్లా కాకనూరుకు భార్యా సమేతంగా వెళ్లిన గాలి, అక్కడి మామిడి తోటకు వెళ్లి సరదాగా గడిపారు. చిన్నప్పుడు తాను చెట్లు ఎక్కిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఆపై ఓ చెట్టు ఎక్కారు. తన భార్యను కూడా ఎక్కించారు. కాయలు కోసి అందరూ తిన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను, వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశారు.
Mango
Gali Janardhan Reddy
Trees
Kurnool District

More Telugu News