Chandrababu: నేడు కుప్పం రానున్న చంద్రబాబు.. భద్రత కట్టుదిట్టం

  • ఉదయం 9:30 గంటలకు కుప్పం చేరుకోనున్న బాబు
  • మంగళవారం రాత్రే కుప్పం చేరుకున్న భువనేశ్వరి
  • అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం బెంగళూరుకు బాబు
ఢిల్లీ పర్యటనలతో తీరిక లేకుండా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం 9:30 గంటలకు కుప్పం చేరుకోనున్నారు. ఇప్పటికే కుప్పం చేరుకున్న భార్య భువనేశ్వరితో కలిసి ఉదయం 10:30 గంటలకు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడిబాల సమర్పిస్తారు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కుప్పం రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, మంగళవారం రాత్రే కుప్పం చేరుకున్న భువనేశ్వరి పీఈఎస్ వైద్య కళాశాల అతిథి గృహంలో బసచేశారు.  
Chandrababu
Kuppam
Chittoor District
Banglore

More Telugu News