Andhra Pradesh: జాతీయ నేతల చుట్టూ చంద్రబాబు తిరిగే దుస్థితి ఏర్పడింది: దాడి వీరభద్రరావు

  • నాడు ఎన్టీఆర్ చుట్టూ జాతీయ నాయకులు తిరిగేవారు
  • ఏపీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు
  • దొంగ సర్వేలతో పబ్బం గడపాలని చూస్తున్నారు
 ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు విమర్శలు గుప్పించారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్టీఆర్ చుట్టూ జాతీయ నాయకులు తిరిగేవారని, ఇప్పుడు, జాతీయ నేతల చుట్టూ చంద్రబాబు తిరిగే దుస్థితి వచ్చిదని విమర్శించారు. ఏపీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవుతుందని తెలిసి దొంగ సర్వేలతో పబ్బం గడపాలని చంద్రబాబు చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టులకు కక్కుర్తిపడి చంద్రబాబుకు అనుకూలంగా లగడపాటి తన సర్వే ఇచ్చారని ఆరోపించారు.
Andhra Pradesh
Telugudesam
cm
Chandrababu
YSRCP

More Telugu News