congress: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దు: ప్రియాంక గాంధీ

  • మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయి
  • ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి 
  • మన శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుంది
కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ధైర్యం చెప్పారు. ఈ మేరకు ఓ ఆడియో సందేశాన్ని ఆమె పంపారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలన్న ఉద్దేశ్యంతోనే ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ సూచించారు. కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్స్ రూమ్స్ వద్ద నిఘా ఉంచాలని, తమ శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆ ఆడియోలో ప్రియాంక పేర్కొన్నారు.
congress
priyanka gandhi
bjp
elections

More Telugu News