New Delhi: మేము లేవనెత్తిన సమస్యలకు ఈసీ వెంటనే పరిష్కారం చూపాలి: ఢిల్లీలో చంద్రబాబు

  • ఢిల్లీలో సీఈసీని కలిసిన ఎన్డీయేతర పక్షాల నేతలు
  • మొత్తం వీవీ ప్యాట్స్ లెక్కించేందుకు ఈసీకి సమస్యేంటి?
  • ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఎన్డీయేతర పక్షాల నేతలు కలిశారు.
అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, కొన్ని రోజులుగా ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశామని అన్నారు. మొత్తం వీవీ ప్యాట్స్ ను లెక్కించేందుకు ఈసీకి సమస్యేంటి? అని  ప్రశ్నించారు. ఎన్నికల పోలింగ్ లో పారదర్శకత, ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత అని అన్నారు. తాము లేవనెత్తిన సమస్యలు చిన్నవి కావని, దీనికి ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే ఈ సమస్య మరింత పెద్దది అవుతుందని అన్నారు.
New Delhi
Andhra Pradesh
cm
Chandrababu

More Telugu News