isro: రేపు నింగిలోకి మరో శాటిలైట్.. టెర్రరిస్టులపై నిఘానే దీని లక్ష్యం

  • రేపే పీఎస్ఎల్వీ-సీ46 ప్రయోగం
  • రీశాట్2బీఆర్1 శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఇస్రో
  • ఉగ్రవాదుల కదలికలు, స్థావరాలపై నిరంతర నిఘా

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రేపు పీఎస్ఎల్వీ-సీ46 ను నింగిలోకి పంపుతోంది. దీని ద్వారా రీశాట్2బీఆర్1 శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్ సేవలు భారత రక్షణ రంగానికి మరింత చేయూతను అందించనున్నాయి. ముఖ్యంగా టెర్రరిస్టుల పాలిట ఇది సింహ స్వప్నంగా మారనుంది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు, వారి స్థావరాలపై ఇది నిరంతర నిఘా ఉంచుతుంది. ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్ కు అందజేస్తుంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలను అందిస్తుందని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగంపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించామని చెప్పారు.

More Telugu News