Delhi: ఢిల్లీలో ఎన్డీయేతర పక్ష నేతల సమావేశం

  • కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఎన్డీయేతర పక్ష నేతల భేటీ
  • ఈసీ అనుసరిస్తున్న పక్షపాత ధోరణిపై చర్చ
  • భేటీ అనంతరం ఈసీని కలవనున్న నేతలు
ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఎన్డీయేతర పక్ష నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, అభిషేక్ మను సింఘ్వీ, డీఎంకే నేత కనిమొళి, సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి.రాజా సహా 19 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈసీ అనుసరిస్తున్న పక్షపాత ధోరణిపై సమావేశంలో చర్చించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం నేతలందరూ ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.
Delhi
Telugudesam
congress
cpi
cpm
dmk

More Telugu News