Bigg Boss: బిగ్ బాస్-3 కంటెస్టెంట్స్ జాబితా... పోటీదార్లలో రేణు దేశాయ్, ఉదయభాను!

  • మూడో సీజన్ కు శరవేగంగా ఏర్పాట్లు
  • కంటెస్టెంట్లు వీరేనంటూ లీకులు
  • వరుణ్ సందేశ్, హేమచంద్ర, గుత్తా జ్వాల కూడా
తెలుగు బిగ్ బాస్ సీజన్-3కి ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండు సీజన్లలో అలరించిన ఈ రియాల్టీ షో, ఇప్పుడు మూడోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లీక్ బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నారట.

ఇదే సమయంలో టీవీ యాంకర్ ఉదయ భాను, యూ ట్యూబర్ జాహ్నవి దాసెట్టి, నటి శోభితా దూళిపాళ, గద్దె సింధూర, టీవీ నటుడు జాకీ తోట, నటులు వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, మనోజ్ నందం, డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కంటెస్టెంట్స్ గా ఉంటారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
Bigg Boss
Season 3
Contestents
Renu Desai
Udayabhanu
Hemachandra
Gutta Jwala

More Telugu News