Sriya: శ్రియ డ్యాన్స్ చేస్తుంటే... కోతిగా మారిపోయిన మనిషి ముఖం... వైరల్ వీడియో!

షార్ట్స్‌లో చూడండి
గత ఏడాది ఆండ్రీ కొశ్చవ్ ను వివాహం చేసుకున్న శ్రియ, ఆపై సినిమాలకు కాస్తంత దూరంగా ఉంటోంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' తరువాత మరో సినిమాలో కనిపించని ఈ భామ, సోషల్ మీడియాను మాత్రం విడిచి పెట్టలేదు. అప్పుడప్పుడూ తన వీడియోలను షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తూ ఉన్న శ్రియ, తాజాగా, పింక్ బికినీలో ఓ ఫోటో ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. శ్రియ డ్యాన్స్ చేస్తుంటే, ఆమె వెనుక ఫొటోలో ఉన్న మనిషి ముఖం కోతిగా మారిపోయింది. ఈ వీడియోను శ్రియ భర్త కొశ్చెవ్ తన స్మార్ట్ ఫోన్ లో బంధించాడని తెలుస్తోంది. దాన్ని మీరు కూడా చూడండి.
Go Back to Shorts
Sriya
Dance
Monkey
Face
Viral Videos

More Telugu News