Devineni Uma: చిత్తశుద్ధి లేని శివపూజలు ఎందుకు జగన్?: దేవినేని ఉమ ఎద్దేవా!
- మహిళా ప్రభంజనంతో టీడీపీ గెలుపు ఖాయం
- జగన్ కు రాజ్యాధికారం పగటి కలే
- విజయవాడలో మీడియాతో దేవినేని
అధికారం కోసం వైఎస్ జగన్, చిత్తశుద్ధి లేని శివపూజలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, మహిళా ప్రభంజనంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, ఈ ఎన్నికల్లో వెయ్యిశాతం గెలుపు సాధ్యమని చెప్పగలిగిన ఏకైక పార్టీ తమదేనని ఆయన అన్నారు.
ఎన్నికలు ముగిసిన తరువాత 40 రోజుల పాటు తాను నిలిపిన అభ్యర్థులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేని జగన్ కు, రాజ్యాధికారం పగటి కలేనని అంచనా వేశారు. బీహార్ ముఠాతో ఏపీలో దిగిన ప్రశాంత్ కిశోర్, జగన్, విజయసాయిరెడ్డిలు, ఓడిపోయిన తరువాత మీడియా ముందుకు వచ్చి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించిన ఉమ, అరాచకశక్తులు అధికారం కావాలని పాకులాడుతున్నాయని, ఈ విషయాన్ని ఏపీ ప్రజలు ముందే గ్రహించి, తమ తీర్పును నిక్షిప్తం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతుంటే, కేవీపీ రామచంద్రరావు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.