devineni uma: రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారు: దేవినేని ఉమ

  • టీడీపీ మరోసారి అధికారంలోకి రాబోతోంది
  • ఏం చూసి ప్రజలు జగన్ కు ఓటు వేయాలి?
  • చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి అని ప్రజలు నమ్ముతున్నారు
ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని... 23న ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తాము సంబరాలు చేసుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసుకుని, తెలంగాణలో వైసీపీ అధినేత జగన్ సంబరపడిపోతున్నారని ఎద్దేవా  చేశారు. ఏం చూసి ప్రజలు జగన్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు. అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటు వేస్తారని అన్నారు. రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకే ఓటు వేశారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావన ప్రజల్లో బలంగా ఉందని అన్నారు.
devineni uma
jagan
Chandrababu
ysrcp
Telugudesam

More Telugu News