Rajive Gandhi: రాజీవ్ గాంధీని గుర్తు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ!

  • నేడు రాజీవ్ గాంధీ వర్థంతి
  • నివాళులు అర్పించిన ప్రధాని
  • ట్విట్టర్ లో ట్వీట్
నేడు రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన్ను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో మోదీ ఓ ట్వీట్ పెట్టారు. "మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు రాజీవ్ స్మారక చిహ్నమైన 'వీర్ భూమి' వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ తదితర ప్రముఖులు రాజీవ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి.





Rajive Gandhi
Narendra Modi
Death Anniversary

More Telugu News