Pawan Kalyan: పూర్తి ఫలితాలు వెల్లడయ్యే వరకూ విజయవాడలోనే పవన్ కల్యాణ్ మకాం!

  • 23న అసెంబ్లీ ఫలితాలు
  • నేడు విజయవాడకు పవన్ కల్యాణ్
  • నేతలతో ప్రత్యేక చర్చలు
ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో, జనసేన అధినేత మరో మూడు రోజులు విజయవాడలో మకాం వేయనున్నారు. నేడు విజయవాడకు చేరుకునే పవన్ కల్యాణ్, ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యే వరకూ ఇక్కడే ఉండనున్నారు. నేడు జనసేన కార్యాలయంలో స్థానిక నేతలతో భేటీ కానున్న పవన్, ఓట్ల లెక్కింపుపై చర్చించనున్నారు. కౌంటింగ్ సెంటర్లో ఏజంట్లు వ్యవహరించాల్సిన తీరుపైనా పవన్ సీనియర్ నాయకులతో చర్చించి, సలహా, సూచనలు ఇవ్వనున్నారు.
Pawan Kalyan
Elections
Results

More Telugu News