చంద్రబాబు నేతృత్వంలో నేడు సమావేశం కానున్న బీజేపీయేతర పార్టీలు
- హాజరు కానున్న 21 పార్టీల ప్రతినిధులు
- వివిధ అంశాలపై చర్చించనున్న నేతలు
- అనంతరం ఈసీని కలవనున్న చంద్రబాబు
ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్, అఖిలేశ్, మమత, శరద్ పవార్, మాయావతి వంటి నేతలను కలిసిన చంద్రబాబు ఫలితాల అనంతర పరిస్థితులపై చర్చించారు. కాగా, నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు చంద్రబాబు నేతృత్వంలో బీజేపీయేతర పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో 21 పార్టీల ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఈసీని కలవనున్నారు.