Vizag: విశాఖలో ఘోరం... కారు డిక్కీలో ఊపిరాడక చిన్నారి మృతి

షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నంలో ఓ చిన్నారి విషాదకర పరిస్థితుల్లో మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. కారు డిక్కీలో ఊపిరాడక ప్రేమ్ కుమార్ అనే ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు.  ప్రేమ్ కుమార్ ఇవాళ ఉదయం తండ్రితో పాటు కారు సర్వీసింగ్ కు వెళ్లాడు. అయితే, కాసేపటితర్వాత వెతకగా, కారు డిక్కీలో ఆ చిన్నారి విగతజీవిగా పడి ఉండడం గమనించిన తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ప్రేమ్ కుమార్ డిక్కీలో ఊపిరాడక చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. స్థానికంగా జరిగిన ఈ ఘటనతో మల్కాపురం నేవల్ ఎంజీఆర్ పార్క్ క్వార్టర్స్ లో ఈ ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Go Back to Shorts
Vizag

More Telugu News