Rajasthan: సామూహిక అత్యాచార బాధితురాలికి పోలీస్ ఉద్యోగం.. రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం!

  • భర్త ఎదుటే వివాహితపై సామూహిక అత్యాచారం
  • ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఎన్నికల సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు
గత నెలలో రాజస్థాన్‌లోని థనగాజి-ఆళ్వార్ బైపాస్ రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న ఓ జంటను అటకాయించి వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది.
Rajasthan
Ashok Gehlat
Police constable
Elections

More Telugu News