kolkata: కోల్ కతా చేరుకున్న చంద్రబాబు

  • బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసే పనిలో ఏపీ సీఎం
  • సీఎం మమతా బెనర్జీతో భేటీ కానున్న చంద్రబాబు
  • భేటీ అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న బాబు
గత వారం రోజులుగా బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసే పనిలో తీరిక లేకుండా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్లీ కోల్ కతా వెళ్లారు. కొద్ది సేపటి క్రితం కోల్ కతా చేరుకున్న ఆయన, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. మమతతో భేటీ అనంతరం, చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తారని సమాచారం. వీవీప్యాట్స్ లెక్కించాలంటూ రేపు ఢిల్లీలో చంద్రబాబు ఆందోళన చేయనున్నారు. 
kolkata
TMC
mamata banerjee
Chandrababu

More Telugu News