harish rao: అమెరికాలో హరీశ్ రావు... ఇప్పుడే ఎందుకెళ్లారన్న బీజేపీ నేత లక్ష్మణ్

  • అమెరికా పర్యటనలో ఉన్న హరీశ్ రావు
  • టీఆర్ఎస్ ఎన్నారై కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ 
  • కేసీఆర్ మూడు తప్పులు చేస్తున్నారన్న లక్ష్మణ్
టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు అమెరికాలో ఉన్నారు. ఫ్లోరిడాలో ఉన్న ట్యాంపా నగరంలో ఎన్నారై టీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యావత్ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. పాలమూరు, కాళేశ్వరం, మిషన్ కాకతీయల ద్వారా కోటి ఎకరాల మాగాణి చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.

మరోవైపు హరీశ్ రావుపై బీజేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయని... ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాకు ఆయన ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని... ఏడు స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని చెప్పారు. కేసీఆర్ మంచి పనులు చేస్తున్నప్పటికీ... మూడు తప్పిదాల వల్ల అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారని తెలిపారు.
harish rao
TRS
lakshman
bjp
kcr

More Telugu News