Telugudesam: జగనే సీఎం అంటున్న వీడీపీ అసోసియేట్స్, సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్!

షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తో సందడి వాతావరణం నెలకొంది. అనేక మీడియా సంస్థలు ఏ పార్టీకి ఎంత ఆధిక్యం వస్తుంది? ఎవరిది ముందంజ? ఎవరిది పైచేయి? అంటూ రకరకాలుగా అంచనాలు వెలువరిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీడీపీదే గెలుపని చెబుతుండగా, వీడీపీ అసోసియేట్స్, సీపీఎస్ సంస్థలు మాత్రం జగనే సీఎం అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి.

వీడీపీ అసోసియేట్స్ అంచనాల ప్రకారం వైసీపీ 111 నుంచి 121 సీట్లు, టీడీపీ 54 నుంచి 60 సీట్ల వరకు గెలుచుకుంటాయట! జనసేనకు 4 స్థానాలు వస్తాయని వీడీపీ పేర్కొంది. ఇక సీపీఎస్ సర్వేలో వైసీపీకి తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టారు. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ 130 నుంచి 133 స్థానాల వరకు కైవసం చేసుకుంటుందని, టీడీపీ 43 నుంచి 44 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొన్నారు. జనసేనకు మరీ దారుణంగా ఒక్క సీటు దక్కుతుందని వివరించారు.
Go Back to Shorts
Telugudesam
YSRCP
Jana Sena

More Telugu News