Telugudesam: ఐఎన్ఎస్ఎస్ ఎగ్జిట్ పోల్స్: ఏపీలో టీడీపీకి 118 సీట్లు... వైసీపీకి 52!

  • టీడీపీదే గెలుపంటున్న ఎగ్జిట్ పోల్స్
  • వైసీపీకి మళ్లీ నిరాశేనా!
  • జనసేనకు మూడోస్థానం!
దేశంలో అన్ని విడతల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ కట్టలు తెంచుకున్న ప్రవాహంలా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఏపీలో మరోసారి టీడీపీదే పైచేయి అని జాతీయ స్థాయి మీడియా సంస్థ ఐఎన్ఎస్ఎస్ పేర్కొంది. ఈ సంస్థ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టినట్టు అర్థమవుతోంది. టీడీపీకి 118 సీట్లు, వైసీపీకి 52 సీట్లు దక్కుతాయని ఐఎన్ఎస్ఎస్ పేర్కొంది. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఈసారి టీడీపీకి అదనంగా మరో 16 సీట్లు ఎక్కువగా వస్తాయన్నది సదరు మీడియా సంస్థ అంచనా. ఇక, జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 5 సీట్లు గెలవడం ద్వారా మూడోస్థానంలో నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Telugudesam
YSRCP
Jana Sena

More Telugu News