Sonia Gandhi: సోనియా గాంధీతో ముగిసిన చంద్రబాబు భేటీ

  • ఢిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన భేటీ 
  • భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతల చర్చ
  • యూపీఏ మిత్రపక్షాల సమావేశం ఏర్పాటుపైనా చర్చ  
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడి భేటీ ముగిసింది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది. వీరి సమావేశం సుమారు నలభై నిమిషాలు సాగినట్టు సమాచారం. మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. మాయావతి, అఖిలేశ్ యాదవ్ సహా పలువురి నేతల అభిప్రాయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీల బలాబలాలను సోనియాకు చంద్రబాబు వివరించినట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా-బాబు చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 21 యూపీఏ మిత్రపక్షాల సమావేశం ఏర్పాటు అంశంపైనా చర్చించారని సమాచారం. కాగా, సోనియాతో భేటీ అనంతరం, కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడాతో చంద్రబాబు భేటీ అయ్యారు.
Sonia Gandhi
congress
Chandrababu
Telugudesam

More Telugu News