Telugudesam: తీర్థయాత్రల పేరుతో మోదీ ప్రసారమాధ్యమాల్లో ఉండేలా చూసుకున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడల

  • ఎన్నికల కోడ్ ను మోదీ ఉల్లంఘించారు
  • ‘కోడ్’ ఉల్లంఘనపై ఈసీ చర్యలు చేపట్టట్లేదు
  • సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈసీ పనిచేస్తోంది
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని మోదీ దేవాలయాల సందర్శనకు వెళ్లడాన్ని సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ ను మోదీ ఉల్లంఘించారని, ఎన్నికల ప్రచారం ముగిశాక కూడా తీర్థయాత్రల పేరుతో కేదార్ నాథ్, బద్రీనాథ్ వెళ్లి ప్రసారమాధ్యమాల్లో ఉండేలా చూసుకున్నారని మోదీపై విమర్శలు చేశారు. చివరకు, దేవాలయాలను కూడా మోదీ రాజకీయంగా ఉపయోగించుకున్నారని, ‘కోడ్’ ఉల్లంఘనపై ఈసీ చర్యలు చేపట్టట్లేదని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈసీ పనిచేస్తోందని దుయ్యబట్టారు.

Telugudesam
MP
Kanaka medela
pm
modi
kanaka

More Telugu News