Delhi: ఎన్నికల తర్వాత అన్ని అంశాలపై స్పష్టత వస్తుంది: సీతారాం ఏచూరి

  • బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో చర్చలు  
  • ప్రస్తుతం  జరిగేవి ప్రాథమిక సంప్రదింపులు మాత్రమే  
  • ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తాం
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో ఏచూరి మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రాథమిక సంప్రదింపులు మాత్రమే జరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని, ‘కూటమి’కి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తామని చెప్పారు. దీనిపై ఇప్పుడే ఎలాంటి ప్రకటనా చేయలేమని స్పష్టం చేశారు. కాగా, గత మూడురోజులుగా ఢిల్లీలో చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. జాతీయ పార్టీ నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, మాయావతితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ రోజు కూడా రాహుల్, శరద్ పవార్ ని చంద్రబాబు కలిశారు.  
Delhi
Andhra Pradesh
cm
Chandrababu
Echuri

More Telugu News