Telangana: అమ్మాయిల పేర్లు చెట్టుపై చెక్కి పూజలు..సైకో శ్రీనివాసరెడ్డి కేసులో కొత్త కోణం!

  • ముగ్గురు యువతులను చంపిన శ్రీనివాసరెడ్డి
  • రావి,వేప, మేడిచెట్టుకు పూజలు నిర్వహణ
  • అనుమానించని హాజీపూర్ గ్రామస్థులు
తెలంగాణ లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్ అత్యాచారాల కేసులో నిందితుడు సైకో శ్రీనివాసరెడ్డిలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి చంపేసిన శ్రీనివాసరెడ్డి వారిని బావిలో పూడ్చిపెట్టాక అక్కడే ఉన్న మేడిచెట్టుకు రోజూ పూజలు చేసేవాడట. ఈ చెట్టుపై మనీషా, కల్పన, శ్రావణి పేర్లను నిందితుడు చెక్కాడు.

అయితే మేడిచెట్టు పక్కనే రావి, వేపచెట్టు కూడా ఉండటంతో వాటికి కూడా శ్రీనివాసరెడ్డి పూజలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. అందువల్లే అతడిని ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఈ మూడు హత్యలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బెరుకులేకుండా శ్రీనివాసరెడ్డి ఈ చెట్లకు నీళ్లు పోసి పసుపు, కుంకుమ బొట్లను పెట్టి పూజించేవాడని స్థానికులు పేర్కొన్నారు.
Telangana
Yadadri Bhuvanagiri District
psyco srinivasa reddy
hazipur

More Telugu News