cm: కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుంది: విష్ణుకుమార్ రాజు

  • ప్రతిపక్షాల కల నెరవేరడం కష్టం
  • మోదీ మళ్లీ ప్రధాని కాబోతున్నారు
  • మోదీ అవసరం ఈ దేశానికి ఉంది
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, అందులో, ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏపీ భవన్ లో చంద్రబాబును బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ని పలకరించిన మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏకు 160 కంటే ఎక్కువ స్థానాలు రావని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అది వాళ్ల ఆశ, అది నెరవేరడం కష్టమని అన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కాబోతున్నారని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరం ఈ దేశానికి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి పెద్ద ఆశాజనకంగా ఉండదన్న విషయం అందరికీ తెలిసిందేనని, కొన్ని స్థానాల్లోనైనా గెలిస్తే బాగుంటుంది కానీ, అది కష్టమని అన్నారు.
cm
Chandrababu
bjp
vishnu kumar raj

More Telugu News