raghva lawrence: మాట నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్.. ‘కేరళ అమ్మ’కు ఇంటిని కట్టించిన దర్శకుడు!

  • గతేడాది గజా తుపానుతో సర్వం కోల్పోయిన పెద్దావిడ
  • వీడియో చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్
  • కొత్త ఇంటిలో ఆమెతో కలిసి గృహప్రవేశం
తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అనాథ పిల్లలను ఆదుకోవడంలో, ఉచిత ఆపరేషన్లు చేయించడంలో, పెద్దలకు నిలువనీడ కల్పించడంలో లారెన్స్ తర్వాతే ఎవరైనా. గతేడాది నవంబర్ నెలలో గజా తుపాను తమిళనాడు, కేరళను వణికించింది. భీకరమైన గాలులు, భారీ వర్షాలతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో కేరళలోని ఓ పెద్దావిడ ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయింది.

ఈ వీడియో చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే పెద్దావిడకు సొంత నిధులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. పూజలు నిర్వహించిన అనంతరం వృద్దురాలితో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు.
raghva lawrence
Kerala
old woman
house
gaja storm

More Telugu News