Chittoor District: చంద్రగిరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న రీపోలింగ్.. పోలీసుల భారీ భద్రత

  • సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్
  • ఐఏఎస్ స్థాయి అధికారి పర్యవేక్షణ
  • పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న జనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు కేంద్రాల్లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్ఆర్ కమ్మపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఐపీఎస్‌ స్థాయి అధికారి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుతో నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదుతో రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ మొత్తం ఏడు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
Chittoor District
Chandragiri
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News