Telugudesam: వైసీపీని గెలిపించడానికి బీజేపీ... చంద్రబాబును గెలిపించడానికి ప్రజలు...!: టీడీపీ ఎంపీ కనకమేడల

  • ప్రత్యర్థుల ప్రయత్నాలు ఫలించవు
  • బీజేపీ ఈసీని వాడుకుంటోంది
  • కేంద్రంలో మోదీ వ్యతిరేక పక్షం వస్తుంది
టీడీపీ లీగల్ సెల్ చీఫ్, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. ఈసీ సాయంతో వైసీపీని ఎలాగైనా గెలిపించేందుకు బీజేపీ గట్టి పట్టుదల ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అయితే, ఏపీ ప్రజలు చంద్రబాబునే గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారని, ప్రత్యర్థుల ప్రయత్నాలు ఫలించవని అన్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావాలన్న కోరికతో బీజేపీ ఈసీని వాడుకుని చంద్రగిరిలో రీపోలింగ్ పెట్టించిందని కనకమేడల మండిపడ్డారు. వారికితోడుగా రాష్ట్ర సీఎస్ తయారయ్యారని, ఆయన ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈసారి మోదీ గెలవడం అసాధ్యమని, రాబోయేది మోదీ వ్యతిరేక ప్రభుత్వమేనని అన్నారు.
Telugudesam

More Telugu News