Arvind Kejriwal: ఏదో ఒకరోజు నన్ను కూడా ఆమెలాగా చంపేస్తారు!: కేజ్రీవాల్

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ముగించారు.ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేశారని, ఇప్పుడు తనను కూడా ఆమెలాగా హత్య చేయిస్తారని ఆరోపించారు.

"ఏదో ఒకనాడు నా భద్రతే సిబ్బందే నన్ను చంపేస్తారు, బీజేపీ వారితో ఆ పని చేయిస్తుంది" అంటూ వ్యాఖ్యానించారు. తన భద్రతా అధికారి బీజేపీ అదుపాజ్ఞల్లోనే ఉన్నారని, ఏదైనా జరగొచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దీనిపై ఢిల్లీ పోలీసు విభాగం స్పందించింది. ముఖ్యమంత్రి భద్రత కోసం నియమితులైన తమ సిబ్బంది కేటాయించిన విధులకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేసింది. తమ యూనిట్ అన్ని పార్టీల ముఖ్యనేతలకు భద్రత కల్పిస్తోందని ఢిల్లీ పోలీసు విభాగం తెలిపింది.
Go Back to Shorts
Arvind Kejriwal

More Telugu News