kedarnath: పవిత్ర గుహలో ధ్యానంలో మోదీ... రేపు ఉదయం వరకు ధ్యానముద్రలోనే!

  • కేదారేశ్వరుడిని దర్శించుకున్న మోదీ
  • పవిత్ర ధ్యాన గుహలో ధ్యానంలో నిమగ్నమైన ప్రధాని
  • రేపు ఉదయం వరకు కొనసాగనున్న ధ్యానం
రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని మోదీ ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ ను దర్శించారు. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేదార్ నాథ్ లో ఉన్న పవిత్ర ధ్యాన గుహలో ఆయన ధ్యానంలో నిమగ్నమయ్యారు. రేపు ఉదయం వరకు ఈ ధ్యానం కొనసాగనుంది. ఈ గుహకు చేరుకోవడానికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఆయన కొండపైకి ఎక్కారు.

మరోవైపు, మీడియా విన్నపం మేరకు ప్రారంభంలో కొన్ని ఫొటోలు తీసుకోవడానికి అనుమతించారు. ఆ తర్వాత మీడియాను గుహ వద్దకు అనుమతించలేదు. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ రేపు జరగనున్న తరుణంలో కేదారేశ్వరుడిని మోదీ దర్శించుకోవడం గమనార్హం. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా రేపే పోలింగ్ జరగబోతోంది.
   
kedarnath
holy cave
meditation
Narendra Modi

More Telugu News