Andhra Pradesh: చంద్రబాబు పచ్చి రాజకీయ వ్యభిచారి.. న్యాయ వ్యవస్థపై ఆయన ప్రభావం ఉంది!: సోము వీర్రాజు

  • ఏపీలో ఓడిపోతున్నామని చంద్రబాబుకు అర్థమైంది
  • రైతుల గిట్టుబాటు ధరపై ఎందుకు సమీక్షించడం లేదు?
  • అనంతపురంలో మీడియాతో బీజేపీ నేత
బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి రాజకీయ వ్యభిచారి అని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలడంతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

అనంతపురం జిల్లాలో ఈరోజు ఓ కార్యక్రమానికి హాజరైన సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ ఓటమి ఖరారై పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థపై చంద్రబాబు ప్రభావం ఉందని సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకూ 17 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
BJP
somu veerraju

More Telugu News