Andhra Pradesh: టీవీ9 కేసులో రవిప్రకాశ్, శివాజీలకు బిగిసిన ఉచ్చు.. విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ

  • మూడుసార్లు నోటీసులు జారీ 
  • అయినా విచారణకు హాజరుకాని రవిప్రకాశ్, నటుడు శివాజీ 
  • కనిపిస్తే అదుపులోకి తీసుకోవలసిందిగా ఎయిర్ పోర్టులకు సమాచారం 
టీవీ9 ఛానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్, మాజీ సీఎఫ్ వో మూర్తి, నటుడు శొంఠినేని శివాజీకి ఉచ్చు మరింత బిగిసింది. మూడుసార్లు నోటీసులు జారీచేసినప్పటికీ రవిప్రకాశ్, శివాజీ విచారణకు హాజరుకాకపోవడాన్ని దృష్టిలో పెట్టుకున్న సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరు ముగ్గురు దేశం వదిలి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీచేశారు.

వీరు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు సమాచారం అందించారు. రవిప్రకాశ్, శొంఠినేని శివాజీ ఇంకా అజ్ఞాతంలోనే ఉండగా, మూర్తి మాత్రం పోలీసుల విచారణకు సహకరిస్తున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు టీవీ 9 లోగోను రవిప్రకాశ్ తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మివేశారని ఏబీసీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇటీవల సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Andhra Pradesh
Telangana
TV9
RAVI PRAKASH
shivaji
look out notices

More Telugu News