రైల్వే శాఖ ‘స్వచ్ఛభారత్’ చర్యలు.. ఇకపై పట్టాలపై చెత్తవేస్తే ఫైన్
- పర్యవేక్షణకు ఒక్కో స్టేషన్లో ఒక్కో అధికారి
- తాగునీరు, పరిశుభ్రత, నిషేధిత వస్తువుల తొలగింపుపై దృష్టి
- నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేలు ఆపైన జరిమానా
ప్రయోగాత్మకంగా తమిళనాడు రాజధాని చెన్నై ఎంజీఆర్ సెంట్రల్ రైల్వేస్టేషన్ సహా 19 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది. అలాగే, తాంబరం, చెంగల్ పట్టు, ఆవడి, తిరువళ్లూరు, కాట్పాడి, పెరంబూరు, జాలర్పేట, మాంబళం, గూడువాంజేరి, పెరుంగొళత్తూర్, తిరుత్తణి, సింగపెరుమాళ్కోయల్, చెన్నై బీచ్, గిండి తదితర సబర్బన్ స్టేషన్లలోనే ఈ నిబంధన అమలు చేయనున్నారు.