ప్రపంచ కప్ ను గెలిచే సత్తా ఈ జట్టుకు ఉంది: అనిల్ కుంబ్లే
- కప్ గెలిచే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది
- విజయం ఎలా సాధించాలో ఆసీస్ కు తెలుసు
- ఆసీస్ చాలా బలంగా ఉంది
ఇంగ్లండ్ పరిస్థితులు ఆస్ట్రేలియాకు బాగా తెలుసని కుంబ్లే అన్నాడు. అన్ని ప్రపంచకప్ లలో ఆసీస్ అద్భుతమైన ప్రదర్శన చేసిందని చెప్పాడు. విజయం ఎలా సాధించాలో ఆస్ట్రేలియన్లకు తెలుసని... ప్రపంచకప్ లో ఇదే ముఖ్యమని తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్స్ కు ఆస్ట్రేలియా కచ్చితంగా చేరుతుందని అన్నాడు. టోర్నీని ఆసీస్ విజయవంతంగా ముగిస్తుందని అనుకుంటున్నానని చెప్పాడు.