anil kumble: ప్రపంచ కప్ ను గెలిచే సత్తా ఈ జట్టుకు ఉంది: అనిల్ కుంబ్లే

  • కప్ గెలిచే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది
  • విజయం ఎలా సాధించాలో ఆసీస్ కు తెలుసు
  • ఆసీస్ చాలా బలంగా ఉంది
క్రికెట్ ప్రపంచకప్ కు సమయం దగ్గరపడుతోంది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఈ వరల్డ్ కప్ సందడి మొదలైంది. క్రికెట్ ప్రేమికులంతా ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఈసారి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయే దేశం ఏదో పలువురు క్రికెట్ దిగ్గజాలు ఇప్పటికే జోస్యం చెప్పారు. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ కోచ్ కూడా తన అంచనాలను వెల్లడించాడు. ప్రపంచకప్ గెలిచే సత్తా ఆస్ట్రేలియాకు ఉందని ఈ స్పిన్ మాంత్రికుడు అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లండ్ పరిస్థితులు ఆస్ట్రేలియాకు బాగా తెలుసని కుంబ్లే అన్నాడు. అన్ని ప్రపంచకప్ లలో ఆసీస్ అద్భుతమైన ప్రదర్శన చేసిందని చెప్పాడు. విజయం ఎలా సాధించాలో ఆస్ట్రేలియన్లకు తెలుసని... ప్రపంచకప్ లో ఇదే ముఖ్యమని తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్స్ కు ఆస్ట్రేలియా కచ్చితంగా చేరుతుందని అన్నాడు. టోర్నీని ఆసీస్ విజయవంతంగా ముగిస్తుందని అనుకుంటున్నానని చెప్పాడు.
anil kumble
Australia
world cup

More Telugu News