Kurnool District: వెల్దుర్తి బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ అరెస్ట్.. బస్సు తయారీ సంస్థకు నోటీసులు

  • కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఘటన
  • ప్రమాదంలో 17 మంది మృతి
  • ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్, బస్సు తయారీ సంస్థలకు నోటీసులు
కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 44వ జాతీయ రహదారిపై వెల్దుర్తి క్రాస్ రోడ్డు సమీపంలో వోల్వో బస్సు తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ గద్వాలలోని శాంతి నగర్‌కు చెందినవారే. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్  ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 63 మంది సాక్షులను విచారించారు. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్, బస్సు తయారీ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తేల్చారు.
Kurnool District
veldutrhi
Road Accident
Driver
SRS Travels

More Telugu News