Jagan: రాళ్లపల్లి మరణవార్త తెలిసి విచారం వ్యక్తం చేసిన జగన్

  • అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన రాళ్లపల్లి
  • రాళ్లపల్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్
  • ట్వీట్ చేసిన వైసీపీ
టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాళ్లపల్లి కన్నుమూసిన విషయం తెలిసి జగన్ ఎంతో విచారానికి లోనయ్యారంటూ వైసీపీ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రాళ్లపల్లి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఓ నటుడిగానే కాకుండా దర్శకరచయితగా అటు నాటక రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ అనితరసాధ్యమైన రీతిలో ఎన్నో ఘనతలు సాధించారని వైసీపీ రాళ్లపల్లిని కీర్తించింది.
Jagan
Rallapalli

More Telugu News