suddala ashok teja: వీడికి ఏ పనీ చేతకాదు .. ఎలా బతుకుతాడోనని నా గురించి మా నాన్న బాధపడుతూ ఉండేవాడు: సుద్దాల అశోక్ తేజ

  • మా నాన్న ఆందళన నా గురించే 
  • నేను అదృష్టవంతుడినని అమ్మ చెప్పేది
  •  నా ఎదుగుదల మా అమ్మ చూసింది 
తాజా ఇంటర్వ్యూలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులను గురించి ప్రస్తావించారు. "మా నాన్న నా గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. 'వీడికి ఏ పనీరాదు .. ఎలా బతుకుతాడో ఏమో' అని చెప్పేసి, అది నేర్చుకో .. ఇది నేర్చుకో అనేవాడు. ఆ మాటలను నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు.

మా అమ్మ మాత్రం 'వాడికి ఏ పనీ రాదని అనకండి .. రేప్పొద్దున వాడు అద్భుతాలు చేస్తాడు. వాడు బతకడమే కాకుండా నలుగురిని బతికిస్తాడు .. వాడు చాలా అదృష్టవంతుడు" అని మా అమ్మ చెప్పేది. ఆ తరువాత కాలంలో నేను గేయరచయితగా ఎదిగాను .. ఓ ఇల్లు కట్టుకున్నాను .. కారు కొనుక్కున్నాను. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. ఇవన్నీ మా అమ్మ చూసిందిగానీ .. మా నాన్నే చూడలేకపోయాడు. నా ఇంటర్ పూర్తయిన తరువాత ఆయన చనిపోయాడు" అని చెప్పుకొచ్చారు.
suddala ashok teja

More Telugu News