Chandrababu: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరాతో చంద్రబాబు భేటీ.. ఈసీ తీరుపై అభ్యంతరం
- ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు
- చంద్రగిరి రీపోలింగ్ పై అభ్యంతరం
- టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ అసహనం
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో జరగనున్న రీపోలింగ్ పై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, కేవలం వైసీపీ ఫిర్యాదులను మాత్రమే పట్టించుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పలువురు జాతీయ స్థాయి నాయకులతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి లక్నోకు వెళ్లి మాయావతిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.