Chandrababu: ఈ నెల 23 తర్వాత చంద్రబాబుపై తిరుగుబాటు జరగడం ఖాయం... ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు జరుగుతాయి: విజయసాయిరెడ్డి

  • టీడీపీ ముక్కచెక్కలవుతుంది
  • ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని స్వార్థప్రయోజనాల కోసం వాడుకున్నారు
  • టీడీపీని భ్రష్టుపట్టించారు
వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుని ఇవాళ భ్రష్టుపట్టించారని ఆయన మండిపడ్డారు. టీడీపీని నాశనం చేసినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరగడం ఖాయమని, ఈ నెల 23 తర్వాత ఆ పార్టీ ముక్కచెక్కలవుతుందని అన్నారు. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన చంద్రబాబు పరువు కాపాడుకోవడం కోసం మహానాడును రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వింతలు, విడ్డూరాలు ఇకముందు చాలా చూస్తామని విజయసాయి తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
Chandrababu
Telugudesam
Vijay Sai Reddy
YSRCP

More Telugu News