rashmika: నాకు మంచి మార్కులు పడటానికి అదే కారణం: రష్మిక మందన

  • నా నటన సహజంగా అనిపించడానికి అదే కారణం 
  • తెలుగు అలా వచ్చేసింది 
  • నా స్థాయిని పెంచే పాత్రలే చేస్తాను         
 తెలుగు తెరకి 'ఛలో' సినిమా ద్వారా పరిచయమైన రష్మిక, తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. ఆ తరువాత చేసిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వరుస అవకాశాలు వస్తున్నాయి. చాలా సహజంగా నటిస్తోందంటూ యూత్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

తాను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందు ఉంటాననీ, అందువల్లనే తన నటన చాలా సహజంగా అనిపిస్తూ ఉంటుందని రష్మిక చెప్పింది. ఇక ఇంతకుముందు తనకి తెలుగు వచ్చేది కాదనీ, దాంతో సెట్లో అందరినీ తెలుగు మాట్లాడమని చెప్పేదానినని అంది. అలా అంతా తెలుగు మాట్లాడుతూ ఉండటం వలన .. వాళ్లతో తాను తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించడం వలన ఇప్పుడు చాలా వరకూ తెలుగు వచ్చేసిందని చెప్పింది. తన స్థాయిని మరింత పెంచే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నానని అంది.
rashmika

More Telugu News