YSRCP: చెవిరెడ్డి వల్లే చంద్రగిరిలో శాంతిభద్రతల సమస్య: టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని

  • అరాచకాలు సృష్టించాలని చూస్తే చూస్తూ ఊరుకోం
  • కార్యకర్తలకు అండగా నిలబడతాం
  • రీపోలింగ్ ను మా కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వల్లే చంద్రగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందని ఆ నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. రామచంద్రాపురం మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించాలని చూస్తే చూస్తూ ఊరుకోమని, కార్యకర్తలకు అండగా నిలబడతామని అన్నారు. రీపోలింగ్ ను తమ కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, పోలింగ్ శాతం గతంలో కంటే పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
YSRCP
chevireddy
bhasker reddy
Telugudesam
pulivarthi

More Telugu News