jaish e mohammed: శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్ లను టార్గెట్ చేసిన పాక్ ఉగ్రవాదులు.. హైఅలర్ట్

  • దాడులకు స్కెచ్ వేసిన జైషే మొహమ్మద్
  • మే 23లోగా దాడికి ప్లాన్
  • భద్రత మరింత కట్టుదిట్టం
భారత్ పై సరికొత్త దాడులకు పాకిస్థాన్ ఉగ్రమూకలు సన్నద్ధమవుతున్నాయి. జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని దాడుల చేసేందుకు పాక్ ఉగ్రవాదులు పథకాలను రచిస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ రెండు ఎయిర్ బేస్ ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హైఅలర్ట్ ప్రకటించారు. చారిత్రాత్మక ఇస్లామిక్ యుద్ధం 'బదర్'ను పురస్కరించుకుని జరుపుకునే వేడుకకు ముందే ఈ దాడి జరిగే అవకాశం ఉంది. మహమ్మద్ ప్రవక్త సాధించిన తొలి మిలిటరీ విజయమే బదర్. ఈ నెల 23న ఈ వేడుక జరగనుంది. పుల్వామా ఘటనకు పాల్పడిన జైషే మొహమ్మద్ ఈ దాడులకు స్కెచ్ వేసినట్టు ఇంటెలిజెన్స్ తెలిపింది. 
jaish e mohammed
srinagar
avantipora
attack
plan

More Telugu News