Andhra Pradesh: మైహోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు ఇంట పెళ్లి సందడి.. హాజరైన వైసీపీ అధినేత జగన్!

  • ఈరోజు నోవాటెల్ లో వివాహ వేడుక
  • వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత
  • కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్
  మైహోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు సోదరుడు జగపతిరావు కుమార్తె శ్రీలక్ష్మి వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జస్టిస్ పోనుగంటి నవీన్ రావు కుమారుడు నృపుల్ రావుతో శ్రీలక్ష్మి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చినజీయర్ స్వామి ఆశీస్సులతో నిర్వహించిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను వైసీపీ అధినేత జగన్ ఆశీర్వదించారు. అనంతరం వివాహ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ వెంట వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఉన్నారు.
Andhra Pradesh
Telangana
my homes
rameswararao
wedding
ys jagan
attended
Hyderabad

More Telugu News