Mahesh Babu: 'టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఫరెవర్' జాబితాలో మహేశ్ బాబు... దక్షిణాదిలో ఎవరికీ దక్కని గౌరవం!

షార్ట్స్‌లో చూడండి
గతకొంతకాలంగా విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తన స్థానాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్న టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత 'టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఫరెవర్-2018' జాబితాలో మహేశ్ బాబుకు స్థానం కల్పించారు. ఇప్పటివరకు ఏ దక్షిణాది హీరోకి ఈ గౌరవం లభించలేదు. గతంలో ఉత్తరాది నుంచి ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, అమీర్ తో పాటు అక్షయ్ కుమార్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు మహేశ్ బాబు కూడా వారి సరసన చేరారు. మహర్షి చిత్ర విజయంతో మాంచి ఊపుమీదున్న ఈ టాలీవుడ్ ప్రిన్స్ కు ఇది మరో ఘనత అని చెప్పాలి. మహేశ్ ప్రజాదరణ మరింత విస్తరించిందనడానికి టైమ్స్ గుర్తింపే నిదర్శనం.
Go Back to Shorts
Mahesh Babu

More Telugu News