అక్రమాలకు పాల్పడకపోతే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు?: విజయసాయిరెడ్డి
- చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేశారు
- అక్రమాలు రుజువు కావడంతో ఈసీ రీపోలింగ్ కు ఆదేశించింది
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగుకు పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో ఈసీ రీపోలింగుకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడకపోతే వాళ్లకెందుకు భయం. రీపోలింగ్ అన్యాయం అంటూ ఆందోళనకు దిగడమేమిటి సిగ్గులేకుండా? దళితులు ఈసారి సత్తా చూపాలి’ అని ట్వీట్ చేశారు.