చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు దళితులపై రాడ్లు, కర్రలతో దాడిచేశారు!: వైసీపీ నేత చెవిరెడ్డి
- దళితులు ఓటేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు
- సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించే ఈసీ రీ-పోలింగ్ పెట్టింది
- మీడియాతో మాట్లాడిన చంద్రగిరి ఎమ్మెల్యే
గత నెల 11న పోలింగ్ సందర్భంగా దళితులు ఓటేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని చెవిరెడ్డి విమర్శించారు. అప్పుడు రాడ్లు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దళితులపై దాడులు చేశారని ఆరోపించారు. కాబట్టి ఈసారి పోలింగ్ సందర్భంగా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా చంద్రగిరిలో వైసీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని జోస్యం చెప్పారు.