Andhra Pradesh: మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఈసీతో భేటీ!

  • చంద్రగిరి వ్యవహారంపై నిరసన తెలపనున్న టీడీపీ అధినేత
  • ఏపీ ఎన్నికల అధికారుల తీరుపై కూడా
  • ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించనున్న ఈసీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల వ్యవహారశైలికి చంద్రబాబు ఈసీకి నిరసన తెలియజేయనున్నారు.

చంద్రగిరిలో రీపోలింగ్ వ్యవహారాన్ని తప్పుపడుతూ నిన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎన్ఆర్ క‌మ్మ‌ప‌ల్లె, క‌మ్మ‌ప‌ల్లె, పులివ‌ర్తి ప‌ల్లె, కొత్త కండ్రిగ‌, వెంక‌ట్రామాపురం గ్రామాల్లో గత నెల 11న ఎస్సీలను ఓటేయనివ్వలేదనీ, కాబట్టి రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేత చెవిరెడ్డి ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
Andhra Pradesh
Chandrababu
New Delhi
ec
meeting
Telugudesam

More Telugu News