Anjali: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హారర్ సినిమాతో వస్తున్న అంజలి
  • విజయవాడలో రేపు మహర్షి వేడుక 
  • మోహన్ బాబు భార్యగా ఐశ్వర్య 
*  గత కొన్నాళ్లుగా తెలుగులో వెనుకబడిపోయిన కథానాయిక అంజలి ప్రధాన పాత్ర పోషించిన అనువాద చిత్రం 'లిసా' ఈ నెల 24న తెలుగులో విడుదలవుతోంది. హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్ లో నిర్మించడం విశేషం. ఈ చిత్రం తనకు తెలుగులో మళ్లీ ఆఫర్లు తెచ్చిపెడుతుందని అంజలి ఆశలు పెట్టుకుంది.
*  ఇటీవల విడుదలైన 'మహర్షి' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించడమే కాకుండా, మహేశ్ బాబుకి ఆర్టిస్టుగా కూడా మరింత పేరును తెచ్చింది. ఈ క్రమంలో చిత్రం గ్రాండ్ సక్సెస్ మీట్ ను రేపు (శనివారం) సాయంకాలం విజయవాడలోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహేశ్, పూజా హెగ్డే, అల్లరి నరేశ్ తదితరులు హాజరవుతారు.
*  ప్రముఖ నటుడు మోహన్ బాబు భార్యగా బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ నటించనుంది. మణిరత్నం నిర్మించే 'పొన్నియన్ సెల్వన్' భారీ చిత్రంలో వీరిద్దరూ భార్యా భర్తలుగా నటిస్తారని సమాచారం. 
Anjali
Mahesh Babu
Pooja
Naresh
Aishwarya Rai

More Telugu News